ఆసిఫాబాద్‌అర్బన్: వన్యప్రాణులతో వాతావరణ సమతుల్యత ఏర్పడుతుందని డీఎఫ్‌వో నీరజ్‌కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని అటవీశాఖ కార్యాలయంలో మంగళవారం ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ అడవులు, వన్యప్రాణుల రక్షణకు ప్రజలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. అనంతరం మాణిక్‌గూడ అ ర్బన్ పార్కులో పచ్చదనం, పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు. అలాగే కార్యాలయ ఆవరణలో హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. డీఎఫ్‌వో కుటుంబ సభ్యులు, సి బ్బంది ఒకరికొకరు రంగులు చల్లుకుంటూ శు భాకాంక్షలు చెప్పుకున్నారు. రేంజ్ అధికారి గోవింద్‌చంద్ సర్దార్, డిప్యూటీ రేంజ్ అధికారులు యోగేశ్ కులకర్ణి, ఝూన్సీ రాణి, సెక్షన్ అధికారులు సాయిచరణ్, మహేందర్, సతీశ్, బీట్ అధికారులు పాల్గొన్నారు.


