లక్ష్య సాధనకు సమష్టి కృషి | - | Sakshi
Sakshi News home page

లక్ష్య సాధనకు సమష్టి కృషి

Mar 17 2026 7:43 AM | Updated on Mar 17 2026 7:43 AM

ఆసిఫాబాద్‌అర్బన్‌: ఆకాంక్షిత జిల్లా, తిర్యాణి బ్లాక్‌ కార్యక్రమాల లక్ష్య సాధనకు అధికారులు సమష్టి కృషి చేయాలని కలెక్టర్‌ కె.హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో ఢిల్లీ నుంచి వచ్చిన నీతి ఆయోగ్‌ అధికారి అష్ణశర్మతో కలిసి సోమవారం సంబంధిత అధికారులతో సమీక్షించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ నీతి ఆయోగ్‌ ఆధ్వర్యంలో సంపూర్ణత అభియాన్‌ 2.0 కింద చేపడుతున్న లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు. ఆకాంక్షిత జిల్లా కార్యక్రమంలో హెల్త్‌ న్యూట్రిషన్‌, పాఠశాలల్లో వసతుల కల్ప న, సాగునీటి వసతి, పశువులకు వందశాతం టీకాలు, ఆర్థిక చేయూత, నైపుణ్యత అభివృద్ధి, ఆ కాంక్షిత తిర్యాణి బ్లాక్‌ కార్యక్రమంలో గిరిజనులు, పీవీటీజీ గిరిజనుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సా రించినట్లు తెలిపారు. సమావేశంలో డీటీడీవో ర మాదేవి, డీఎంహెచ్‌వో సీతారాం, డీఏవో వెంకటి, పంచాయతీరాజ్‌ ఈఈ ధర్మేంధర్‌, గ్రామీణ నీటి సరఫరా ఈఈ సిద్దిక్‌, ఆకాంక్షిత కార్యక్రమాల జిల్లా సమన్వయకర్త బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

బూత్‌స్థాయి ఏజెంట్ల జాబితా అందించాలి

ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీలు తమ తరఫున బూత్‌స్థాయి ఏజెంట్ల వివరాలు అందించా లని కలెక్టర్‌ కె.హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో సోమవారం అదనపు కలెక్టర్‌ డేవిడ్‌, ఆర్డీవో లోకేశ్వర్‌రావుతో కలిసి గుర్తింపు పొందిన రా జకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఏప్రిల్‌లో చేపట్టే ప్రత్యేక సమగ్రత సర్వేలో భాగంగా ఓటర్ల వివరాలు సేకరించేందుకు బూత్‌స్థాయి అధికారులు ప్రతీ ఇంటింటికి వెళ్తారని తెలి పారు. బూత్‌స్థాయి ఏజెంట్ల సహకారంతో కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేస్తామన్నారు. అ లాగే మేలో జాతీయ ఇళ్ల గణనకు రాజకీయ పార్టీలు సహకరించాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement