ఘనంగా శిశుమందిర్‌ వార్షికోత్సవం | - | Sakshi
Sakshi News home page

ఘనంగా శిశుమందిర్‌ వార్షికోత్సవం

Mar 9 2026 7:33 AM | Updated on Mar 9 2026 7:33 AM

ఆసిఫాబాద్‌అర్బన్‌: జిల్లా కేంద్రంలోని శ్రీసరస్వతి శిశు మందిర్‌ 47 వార్షికోత్సవాన్ని శనివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. జిల్లా సైన్స్‌ అధికారి కటకం మధుకర్‌ కార్యక్రమానికి హాజరై మాట్లాడా రు. విద్యార్థులకు కాలనుగుణంగా సాంకేతికతను అందిస్తూ జాతీయ స్థాయిలో ఒలింపియాడ్‌ పరీక్షల్లో శిశుమందిర్‌ ర్యాంకులు సాధిస్తుందని చెప్పారు. వక్త కృష్ణభాస్కర్‌ మాట్లాడుతూ.. ప్రతీ కుటుంబంలో పంచ పరివర్తన రావడానికి ఆర్‌ఎస్‌ఎస్‌ కృషి చేస్తోందని తెలిపారు. తల్లిదండ్రులు పిల్లలకు కుటుంబ విలువలు, పెద్దలపై గౌరవం, దేశభక్తి, దైవభక్తిని పెంపొందించే కథలు వివరించాలనని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సేవ్‌ ట్రీ సేవ్‌ లైఫ్‌, కోలాటం, డంబుల్స్‌, యోగాచాప్‌, పిరమిడ్‌, కరాటే, మొబైల్‌ స్కిట్‌ ఆహూతులను అలరించాయి. మూడోతరగతి వి ద్యార్థిని శ్రీహిత వేసిన శంభాజీ మహరాజ్‌ ఏకపాత్రాభినయం ఆకట్టుకుంది. రాష్ట్ర స్థాయిలో క్రీడలు, పోటీ పరీక్షల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులను మెడల్స్‌తో సత్కరించారు. ప్రధానాచార్యుడు గుండేటి కోటేశ్వర్‌రావ్‌, పాఠశాల అధ్యక్షుడు చిలువేరు వెంకన్న, భోనగిరి సతీశ్‌బాబు, ఎంఈవో రాథోడ్‌ సుభాష్‌, దేవభూషణం, ఖాండ్రె విశాల్‌, వేణుగో పాల్‌, నాగుల శ్రీనివాస్‌, వాసుదేవన శైలేశ్‌, రమాదే వి, వైష్ణవి, వాణి, సుప్రజ, సుమలత పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement