‘తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు’ | - | Sakshi
Sakshi News home page

‘తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు’

Mar 11 2026 7:31 AM | Updated on Mar 11 2026 7:31 AM

రెబ్బెన: మెడికల్‌ బోర్డు విషయంలో తప్పుడు ప్రచారాన్ని కార్మికులు నమ్మొద్దని తెలంగాణ రాష్ట్ర కనీస వేతన సలహా మండలి చైర్మన్‌, ఐఎన్‌టీయూసీ సెక్రెటరీ జనరల్‌ జనక్‌ ప్రసాద్‌ అన్నారు. గోలేటి టౌన్‌షిప్‌లో మంగళవారం ఐఎన్‌టీయూసీ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మెడికల్‌ అధికారిపై అవినీతి కేసుల కారణంగా మెడికల్‌ బోర్డు నిర్వహణలో ఆలస్యం జరిగింద ని, త్వరలోనే బోర్డును పునఃప్రారంభిస్తారని తెలిపా రు. పెర్క్స్‌పై ఆదాయపు పన్ను మాఫీ, సొంతింటి పథకం అమలు, మెడికల్‌ బోర్డు పునరుద్ధరణ వంటి కీలక అంశాలను ఐఎన్‌టీయూసీ నిరంతరం ప్ర భుత్వం దృష్టికి తీసుకెళ్తుందన్నారు. గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగి రెండేళ్లయినా కార్మికుల సమస్యలపై దృష్టి పెట్టకుండా ఏఐటీయూసీ రాజకీయ ప్రయోజనాలకే పరిమితమైందని ఆరోపించారు. సమావేశంలో సెంట్రల్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్లు ధర్మపురి, సమ్మయ్య, శంకర్‌రావు, జనరల్‌ సెక్రెటరీ లు వికాస్‌కుమార్‌, వైస్‌ ప్రెసిడెంట్లు వడ్డెపలి దాస్‌, సదానందం, యూత్‌ ప్రెసిడెంట్‌ రాజు, ఏరియా ఉపాధ్యక్షుడు పేరం శ్రీనివాస్‌, డిప్యూటీ జనరల్‌ సెక్రెటరీ ప్రకాశ్‌రావు, నాయకులు శ్రీనివాస్‌, అంబేడ్కర్‌, నారాయణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement