మలిదశ ఉద్యమానికి సమగ్ర శిక్ష ఉద్యోగుల సన్నద్ధం మూడు విడతల్లో పోరాటం ఈ నెల 16న జిల్లా, డివిజన్ కేంద్రాల్లో ప్రదర్శనలు 20న చలో అసెంబ్లీకి కార్యాచరణ
సమగ్ర శిక్ష ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులరైజ్ చేయాలి. అప్పటి వరకు ఉద్యోగ భద్రతతో కూడిన పే స్కేల్ ఇవ్వాలి.
ప్రతీ ఉద్యోగికి రూ.10 లక్షల జీవిత బీమా, రూ.10 లక్షల ఆరోగ్య బీమా కల్పించాలి.
పదవీ విరమణ పొందుతున్న వారికి బెని ఫిట్స్ కింద రూ.25 లక్షలు చెల్లించాలి.
విద్యాశాఖ నియామకాల్లో వెయిటేజీ కల్పించాలి. ‘రీ ఎంగేజ్’ విధానాన్ని తొలగించాలి.
29 రోజుల సమ్మె కాలపు వేతనాన్ని వెంటనే చెల్లించాలి.
కెరమెరి: సుదీర్ఘ కాలంగా విద్యావ్యవస్థలో విధులు నిర్వహిస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులు(ఎస్‌ఎస్‌ఏ) మలిదశ ఉద్యమానికి సిద్ధమయ్యారు. ఇందులో భా గంగా సోమవారం జిల్లాలో పాఠశాలల స్థాయి, ఎ మ్మార్సీ కేంద్రాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. వీరికి టీఎస్‌యూటీఎఫ్ అండగా నిలిచి పోరాటాన్ని ముందుండి నడిపించేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. మూడు విడతల్లో చేపట్టే నిరసనల్లో భాగంగా సోమవారం నల్లబ్యాడ్జీలతో నిరసన తెలపగా, ఈ నెల 16న జిల్లా, డివిజన్ కేంద్రాల్లో ప్రదర్శనలు, 20న ‘చలో అసెంబ్లీ’ నిర్వహించనున్నారు.
2024లో నిరసనలు
ఏడాదికి పైగా స్తబ్ధుగా ఉన్న ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగులు మరోసారి పోరాటానికి సిద్ధమవుతున్నారు. 2023 ఆగస్టు, సెప్టెంబర్, ఆ తర్వాత 2024 డిసెంబర్‌లో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు చేపట్టారు. వివిధ ఉపాధ్యాయ సంఘాలు, రాజకీయ పార్టీలు, విద్యార్థి, కుల, మహిళా సంఘాలు వీరికి సంఘీభావం తెలిపాయి. మొదటి దఫాలో 24 రోజులు, రెండో దఫాలో 29 రోజులపాటు ఉద్యమం కొనసాగింది. ఈ క్రమంలోనే అప్పటి ఉప ముఖ్యమంత్రితో చర్చలు జరపగా, మూడు నెలల్లో సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో నిరసనలు విరమించారు.
అపరిష్కృతంగా సమస్యలు
ఉమ్మడి జిల్లాలోని ఆదిలాబాద్‌లో 607 మంది, కుమురం భీం ఆసిఫాబాద్‌లో 473 మంది, మంచిర్యాలలో 513 మంది, నిర్మల్‌లో 424 మంది ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగులు పనిచేస్తున్నారు. కేజీబీవీల్లో బోధన, బోధనేతర, సీఆర్‌పీలు, ఎంఈఐఎస్ కోఆర్డినేటర్లు, సీసీవో, ఐఈఆర్‌పీ, పీటీఐ, మెసెంజర్లు, తదితర విభాగాల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులుగా సేవలందిస్తున్న వీరి సమస్యలు రెండు దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో వేతనంలో 30 శాతం పెంచడంతో కొంత సాంత్వన చేకూరినా ప్రస్తుతం ప్రజాప్రతినిధులు ఈ విషయంపై నోరు మెదపడం లేదు. గతేడాది రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ సిబ్బందికి కూడా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. ఇది నేటికీ అమలు కాలేదు. చాలీచాలని వేతనాలతో ఉన్న సమగ్ర శిక్ష ఉద్యోగుల కుటుంబాల జీవన స్థితిగతులను అర్థం చేసుకోవా లని వారు కోరుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ కారణాలతో మరణించిన 235 మంది కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ప్రధాన డిమాండ్లు..


