ఆసిఫాబాద్‌అర్బన్: రానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఆశవర్కర్ల సమస్యలు లేవనెత్తాలని గురువారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే నివాసంలో సీఐటీ యూ ఆధ్వర్యంలో తెలంగాణ ఆశవర్కర్స్ యూనియన్ నాయకులు వినతిపత్రం అందించారు. సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి కృష్ణమాచారి మాట్లాడుతూ రాష్ట్రంలో సు మారు 28 వేల మంది ఆశవర్కర్లు 20 ఏళ్లుగా పనిచేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో వేతనాలు పెంచుతా మని, ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా ఇప్పటివరకు సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. ఆశవర్కర్లకు రూ.18వేల ఫిక్స్‌డ్ వేతనం చెల్లించాలని, ఎన్‌హెచ్‌ఎంకు సరిపడా నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు స్వరూప, అనిత, నవీన, లక్ష్మి, నిర్మల, రేణుక, చంద్రకళ, అరుణ, కళావతి, లావణ్య, సునీత తదితరులు పాల్గొన్నారు.


