కాగజ్‌నగర్‌టౌన్: పంచాయతీ వర్కర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాల ని, వారి సమస్యలు పరిష్కరించాలని గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్(సీఐటీయూ) ఆధ్వర్యంలో పట్ట ణంలోని ఎమ్మెల్యే హరీశ్‌బాబు నివాసంలో వినతిపత్రం అందించారు. యూనియన్ జిల్లా అధ్యక్షుడు మోరేశ్వర్ మాట్లాడుతూ మార్చి 2న ఇచ్చిన జీవోను వెనక్కి తీసుకోవా లని డిమాండ్ చేశారు. పంచాయతీల నుంచి కాకుండా నేరుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రీన్ చానల్ ద్వారా 1వ తేదీన వేతనాలు చెల్లించా లన్నారు. మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని, ఈఎస్‌ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించాలని, జీవో నం.60 ప్రకారం వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు నగేష్, వసంత్ బాలాజీ, రమేశ్, జానమ్మ, ప్రమీళ, వంశీ, ఆకాశ్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.


