డిజిటల్‌ చెల్లింపులపై అవగాహన ఉండాలి | - | Sakshi
Sakshi News home page

డిజిటల్‌ చెల్లింపులపై అవగాహన ఉండాలి

Mar 13 2026 7:41 AM | Updated on Mar 13 2026 7:41 AM

కౌటాల: డిజిటల్‌ చెల్లింపులపై ప్రజలకు అవగాహన ఉండాలని టీజీబీ ఆర్‌ఎం ప్రశాంత్‌ బాలచంద్ర అన్నారు. కౌటాల రైతు వేదికలో గురువారం సురక్షిత డిజిటల్‌ చెల్లింపులపై ఖాతాదారులకు అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ డిజిటల్‌ లావాదేవీల పై అప్రమత్తంగా ఉండాలని, బ్యాంకు సేవల ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. రుణా లు తీసుకుని, సకాలంలో చెల్లించాలని సూ చించారు. బ్యాంకు అధికారులు ఖాతాదారులకు ఫోన్లు చేసి ఓటీపీలు అడగరని తెలిపా రు. బీమా పథకాలను సద్వినియోగం చేసుకో వాలన్నారు. అనంతరం పలువురు లబ్ధిదారులకు బీమా చెక్కులు అందించారు. కార్యక్రమంలో బిజినెస్‌ చీఫ్‌ మేనేజర్‌ రవి కిశోర్‌, సంధ్య, బ్యాంకు మేనేజర్‌ రమేశ్‌, శ్రీనివాస్‌, ఏపీఎం వినేశ్‌రావ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement