ఆసిఫాబాద్‌అర్బన్: గర్భాశయ క్యాన్సర్ నివారణకు 9 నుంచి 14 ఏళ్ల బాలికలకు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ వేయించాలని కలెక్టర్ కె.హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో సోమవారం డీఎంహెచ్‌వో సీతారాం, ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రవీణ్‌కుమార్‌తో కలిసి వ్యాక్సిన్ పంపిణీని ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఎలాంటి అపోహలు లేకుండా బాలికలు వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు. జిల్లాలోని అన్ని ఆస్పత్రుల్లో వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుందని తెలిపారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఆస్పత్రి మహిళా సిబ్బంది కలెక్టర్‌ను శాలువాతో సన్మానించారు.
టీహబ్ మేనేజర్ సస్పెన్షన్
జిల్లా కేంద్రంలోని టీహబ్ మేనేజర్ అర్జున్ విధులకు గైర్హాజరవుతున్నారని ఆస్పత్రి సూపరింటెండెంట్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో టీహబ్ మేనేజర్‌ను విధుల నుంచి సస్పెండ్ చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్‌డీవో దత్తారావు, డీడబ్ల్యూవో భాస్కర్, సిబ్బంది పాల్గొన్నారు.
ప్రజలను చైతన్యవంతులను చేయాలి
ఆసిఫాబాద్‌అర్బన్: కళాజాత ప్రదర్శన ద్వారా ప్రజ లను చైతన్యవంతులను చేయాలని కలెక్టర్ కె.హరి త అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి ఆ వరణలో జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులతో ఏర్పాటు చేసిన కుష్ఠు, బోద వ్యాధుల నివారణ కళాజాత ప్రదర్శన రథాన్ని సోమవారం ప్రారంభించారు.కలెక్టర్ మాట్లాడుతూ కుష్ఠు, బోదకాల వ్యాధుల నివారణ, జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో సీతారాం, డీఆర్‌డీవో దత్తారావు, కోఆర్డినేటర్ శ్యాంలాల్, వైద్య సిబ్బంది, కళాకారులు పాల్గొన్నారు.


