అనుమానిత రేషన్‌కార్డుల తొలగింపు! | - | Sakshi
Sakshi News home page

అనుమానిత రేషన్‌కార్డుల తొలగింపు!

Mar 15 2026 1:22 AM | Updated on Mar 15 2026 1:22 AM

ఇప్పటికే అధికారులకు చేరిన జాబితా 1,508 కార్డులపై క్షేత్రస్థాయి విచారణ బియ్యం పక్కదారి పట్టకుండా చర్యలు మార్గదర్శకాలు రాలేదన్న అధికారులు

ఆసిఫాబాద్‌అర్బన్‌: జిల్లాలో అనర్హుల రేషన్‌కార్డుల తొలగింపునకు రాష్ట్ర ప్రభుత్వం చ ర్యలు చేపట్టింది. లబ్ధిదారులకు పంపిణీ సన్నబియ్యం పక్కదారి పట్టకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకుంది. ఇదివరకే ప్రభుత్వం జిల్లాల వారీగా అనుమానిత కార్డుల జాబి తా రూపొందించింది. జిల్లాలో 1,508 అనుమానిత రేషన్‌కార్డులున్నట్లు పౌరసరఫరాల శాఖ అధికారులకు జాబితా పంపింది. ఈ మేరకు రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి అనర్హులుగా తేలితే వారి కార్డులు తొలగించనున్నారు. అయితే, అనుమానిత రేషన్‌ కార్డుల తొలగింపునకు సంబంధించి మార్గదర్శకాలు రాలేదని సివిల్‌ సప్లయ్‌ శాఖ అధికారులు చెబుతున్నారు. కాగా, ప్రభుత్వ ఉద్యోగం పొందిన వారు, నాలుగెకరాలకు పైబడి వ్యవసాయ భూమి ఉన్నవారు, అత్యధిక వార్షికాదాయం కలిగినవారు, రెండు రేషన్‌కార్డుల్లో పేర్లున్నవారిని అనర్హులుగా గుర్తించనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.

అక్రమ రవాణాకు అడ్డుకట్ట

పేదలకు చౌకధరకే బియ్యం అందించేందుకు ప్రభుత్వాలు రేషన్‌కార్డులు మంజూరు చేస్తున్నాయి. అ యితే, పలు ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందా లంటే రేషన్‌కార్డు ప్రామాణికం కావడంతో పేదలే కాకుండా ధనికవర్గాలు కూడా అక్రమంగా రేషన్‌కా ర్డులు పొందారు. ఇలాంటివారు రేషన్‌షాపుల్లో బి య్యం తీసుకుని బ్లాక్‌లో విక్రయిస్తున్నారు. గతంలో రేషన్‌షాపులకు వచ్చిన దొడ్డు బియ్యం కూడా విక్రయించేవారు. ప్రస్తుతం లబ్ధిదారులకు సన్నబియ్యం ఇస్తుండడంతో పక్కదారి పట్టకుండా ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టింది. గతంలో దారిద్య్ర రేఖకు దిగువనున్న పలు వురు రేషన్‌కార్డులు పొందాక వారికి ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చినా, ఆదాయం పెరిగినా వారి కార్డులు అలాగే ఉండిపోయాయి. అలాగే, చనిపోయిన లబ్ధి దారుల పేర్లు ఇంకా రేషన్‌కార్డుల్లోంచి తొలగించకపోవడంతో వారి పేరిట బియ్యం కోటా అలాట్‌ అవుతోంది. దీంతో వారికి కేటాయించిన బియ్యం పక్కదారి పడుతున్నట్లు ప్రభుత్వం భావించింది. ప్రస్తుతం రేషన్‌కార్డుల్లోంచి అనర్హుల తొలగింపు ప్ర క్రియ చేపడుతుండగా రేషన్‌ బియ్యం బ్లాక్‌ మార్కెట్‌కు తరలకుండా ఉంటుంది.

జిల్లాలో బియ్యం పంపిణీ ఇలా..

ఇప్పటికే అనుమానిత కార్డుల జా బితా జిల్లాకు చేరినా అధికారులు ఇంకా ఎలాంటి తొలగింపు ప్రక్రియ చేపట్టలేదు. జిల్లాలో ప్రస్తుతం 315 రేషన్‌ దుకాణాల ద్వారా 3,519.743 మెట్రిక్‌ టన్నుల సన్నబియ్యం పంపిణీ చేస్తున్నారు. 1,63,765 రేష న్‌కార్డులుండగా 4,95,204 మందికి లబ్ధి చేకూరుతోంది. ప్రభుత్వ ఉద్యో గం వచ్చినవారు, నాలుగెకరాలకు పైబడి వ్యవసాయ భూమి ఉన్నవారు, అధిక వార్షికాదాయం కలి గినవారితోపాటు మరణించిన వా రు, రెండు రేషన్‌కార్డుల్లో పేర్లు న మోదు చేసుకున్నవారితో కలిపి 1,508 అనుమానిత కార్డుల జాబితా రూపొందించినట్లు తెలుస్తోంది. వీటిపై అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేపడతారు. అనర్హులను గుర్తించి వారి కార్డులు తొలగించనున్నారు.

మార్గదర్శకాలు రాలేదు

రాష్ట్ర ప్రభుత్వం నుంచి జిల్లాలోని అనుమానిత రేషన్‌కార్డుల జాబితా చేరింది. ఇప్పటివరకు జిల్లాలో 1,508 అనుమానిత కార్డులున్నట్లు జాబితా వచ్చింది. వారి తొలగింపునకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి మార్గదర్శకాలు అందలేదు. ప్రభుత్వ ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం.

– వనంతలక్ష్మి,

జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement