‘పది’ పరీక్షలు ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

‘పది’ పరీక్షలు ప్రారంభం

Mar 15 2026 1:22 AM | Updated on Mar 15 2026 1:22 AM

● 99.72 శాతం హాజరు నమోదు ● కేంద్రాలను సందర్శించిన కలెక్టర్‌

ఆసిపాబాద్‌రూరల్‌: పదోతరగతి పరీక్షలు శుక్రవా రం ప్రారంభమయ్యాయి. మొదటిరోజు తెలుగు ప రీక్ష ప్రశాంతంగా జరిగినట్లు డీఈవో లలిత తెలి పా రు. జిల్లాలోని 38కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షలకు 6,943 మంది విద్యార్థులకు 6,924 మంది హాజరు కాగా, 19మంది గైర్హాజరయ్యారు. 99.72శాతం హా జరు నమోదైంది. పరీక్ష ఉదయం 9.30 ఉండటంతో విద్యార్థులు గంట ముందే కేంద్రాలకు చేరుకున్నారు. బందోబస్తు కోసం సెంటర్‌కు ఇద్దరు పోలీ స్‌ సిబ్బందిని కేటాయించారు. జిల్లాలోని పలు కేంద్రాలను కలెక్టర్‌ హరిత, డీఈవో లలిత, అదనపు క లెక్టర్‌ డేవిడ్‌, పరీక్షల నిర్వహణాధికారి జనార్దన్‌ సందర్శించారు. జిల్లా కేంద్రంలోని కేంద్రాలను సీఐ బా లాజీవరప్రసాద్‌, ఎస్సై కమలాకర్‌ పరిశీలించారు.

రెబ్బెన కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్‌

రెబ్బెన: మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పదోతరగతి పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్‌ హరిత ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేంద్రాల్లో విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించా లని అధికారులను ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement