ఆసిఫాబాద్‌అర్బన్: తాను చదువుకున్న పాఠశాల అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తానని మున్సిపల్ చైర్మన్ మెంగ్రె ఆకాశ్ హామీ ఇచ్చా రు. జిల్లా కేంద్రంలోని దస్నాపూర్ ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న ఆకాశ్‌ను శనివారం పాఠశాల యాజమాన్యం, పూర్వవిద్యార్థులు పూలమాలలు, శాలువాలతో సత్కరించి శు భాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆకాశ్ మా ట్లాడుతూ.. తాను చదువుకున్న పాఠశాలలో మున్సిపల్ చైర్మన్ హోదాలో సన్మానం పొంద డం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నా రు. పాఠశాలలోని తాగునీటి సమస్య పరిష్కరించేందుకు బోరు వేయిస్తానని హామీ ఇచ్చా రు. పాఠశాలలో ఎలాంటి సమస్య ఉన్నా తనకు తెలిపితే పరిష్కరిస్తానని చెప్పారు. గతంలో పాఠశాలలో విధులు నిర్వహించి ప్రమోషన్, బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయులు నాగరాణి, ఉమారాణిని ప్రధానోపాధ్యాయురాలు అనిత, ఉపాధ్యాయులు శ్రావణ్, గంగాధర్ శాలువాలతో సన్మానించారు.


