ప్రమోషన్‌ పత్రాలు అందజేత | - | Sakshi
Sakshi News home page

ప్రమోషన్‌ పత్రాలు అందజేత

Mar 15 2026 1:22 AM | Updated on Mar 15 2026 1:22 AM

రెబ్బెన: బెల్లంపల్లి ఏరియాలోని ఖైరిగూర ఓసీపీలో పలువురు ఉద్యోగులకు ప్రాజెక్ట్‌ అధి కారి మచ్చగిరి నరేందర్‌ శనివారం పంప్‌ ఆపరేటర్‌ ప్రమోషన్‌ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రమోషన్లు పొందిన ఉద్యోగులు రెట్టింపు బాధ్యతతో విధులు నిర్వహించాలని సూచించారు. అర్హులైన ప్రతీ ఉద్యోగికి సంస్థ నియమ నిబంధనలకు లోబడి ప్రమోషన్లు అందుతాయని తెలిపారు. ప్రమోషన్ల విషయంలో ఉద్యోగులు ఎలాంటి ఆందోళనకు గురికావద్దని పే ర్కొన్నారు. ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌ వీరన్న, మేనేజ ర్‌ శంకర్‌, ఏఐటీయూసీ పిట్‌ కార్యదర్శి మా రం శ్రీనివాస్‌, ఆర్గనైజింగ్‌ కార్యదర్శి కిరణ్‌బా బు, వెల్ఫేర్‌ అధికారి రజినికుమార్‌, నాయకు డు పుట్ట అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement