అభివృద్ధిలో భాగస్వాములు కావాలి | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధిలో భాగస్వాములు కావాలి

Mar 11 2026 7:31 AM | Updated on Mar 11 2026 7:31 AM

పెంచికల్‌పేట్‌: నూతనంగా ఎన్నికై న వార్డు సభ్యులు గ్రామ పంచాయతీల అభివృద్ధిలో భాగస్వాములు కావాలని జిల్లా పంచాయతీ అధికారి భిక్షపతిగౌడ్‌ అన్నారు. మండలంలోని ఎల్కపల్లి రైతు వేదికలో వార్డు సభ్యుల శిక్షణ ముగింపు కార్యక్రమానికి మంగళవారం హాజరై సర్టిఫికెట్లు అందించారు. డీపీవో మాట్లాడుతూ పంచాయతీల్లో పారిశుద్ధ్య పనులు, వీధిదీపాల ఏర్పాటు, తాగునీటి సరఫరాతోపాటు మౌలిక వసతుల కల్పనకు కృషి చేయాలన్నారు. అంతకు ముందు దరోగపల్లి, చేడ్వాయి, బొంబాయిగూడ, ఎల్కపల్లి గ్రామాలను సందర్శించి కార్యదర్శులకు సూచనలు చేశారు. ప్రజా పాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలు పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. ఆయన వెంట డీఎల్‌పీవో హరిప్రసాద్‌, ఎంపీడీవో అల్బర్ట్‌, ఎంపీవో మహేందర్‌ రెడ్డి, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement