క్రీడలతో ఉజ్వల భవిష్యత్‌ | - | Sakshi
Sakshi News home page

క్రీడలతో ఉజ్వల భవిష్యత్‌

Mar 16 2026 7:29 AM | Updated on Mar 16 2026 7:29 AM

కౌటాల: క్రీడలతో యువతకు ఉజ్వల భవిష్యత్‌ ఉంటుందని ఎమ్మెల్సీ దండె విఠల్‌ అన్నారు. మండలంలోని గురుడుపేట గ్రామంలో ఆదివారం గ్రామ పంచాయతీ లెవల్‌ క్రికెట్‌ పోటీలను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో క్రీడాపోటీలు నిర్వహించేందుకు సహకరిస్తామని తెలిపారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి క్రీడల్లో రాణించాలన్నారు. కాగా, ఈ పోటీల్లో 40 జట్లు పాల్గొంటున్నాయని, మొదటి బహుమతి రూ.22 వే లు, ద్వితీయ బహుమతి రూ.11 వేలు అందిస్తామని నిర్వాహకులు వెల్లడించారు. కార్యక్రమంలో ఎస్సై చంద్రశేఖర్‌, సర్పంచ్‌ రాగిసిడెం భీంరావ్‌, మాజీ ఎంపీపీ నికాడే గంగారాం, నాయకులు హన్మంతు, రాజేశ్‌, రవి, వెంకటేశ్‌, సంతోష్‌, గోసాయి, బ్రహ్మయ్య, శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement