నేడు కలెక్టరేట్‌ ముట్టడి | - | Sakshi
Sakshi News home page

నేడు కలెక్టరేట్‌ ముట్టడి

Mar 16 2026 7:29 AM | Updated on Mar 16 2026 7:29 AM

ఆసిఫాబాద్‌అర్బన్‌: కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్‌ కోడ్‌లను ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని జిల్లా కేంద్రంలో సోమవారం కలెక్టరేట్‌ ముట్టడి కార్యక్రమం చేపడుతున్నట్లు ఐఎఫ్‌టీయూ రాష్ట్ర సహాయ కార్యదర్శి చాంద్‌పాషా తెలిపారు. జిల్లా కేంద్రంలోని జన్కాపూర్‌లో ఆదివారం పోస్టర్లు ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా లేబర్‌కోడ్‌లను అమలు చేయాలని ప్రయత్నిస్తుందన్నారు. దీనికి నిరసనగా నేడు కలెక్టరేట్‌ ముట్టడి, 23న హైదరాబాద్‌లోని లేబర్‌ కమిషనర్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్మికులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఐఎఫ్‌టీయూ నాయకులు వీరన్న, తిరుపతి, అఖిల్‌, సమీర్‌, తరుణ్‌, బాబా, రాజన్న తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement