కెరమెరి: మండలంలోని శంకర్‌లొద్ది గ్రామంలో ఈ నెల 19న నిర్వహించే ఉగాది ఉత్సవాలకు మహారాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి సంజుభావు రాథోడ్ హాజరుకానున్నట్లు సేవాలాల్ సేనా జిల్లా అధ్యక్షుడు, సేవాలాల్ ఉత్సవ కమిటీ జిల్లా ప్రధాన కార్యదర్శి రూప్‌లాల్ రాథోడ్ తెలిపారు. మండల కేంద్రంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. శంకర్‌లొద్దిలో ఉగాది పర్వదినాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. దాతల ద్వారా భక్తులకు ఉచిత అన్నదానం, తాగునీటి సౌకర్యం కల్పిస్తున్నామని వివరించారు.


