కాగజ్‌నగర్: కాగజ్‌నగర్ బస్టాండ్ కంట్రోలర్‌గా ఆర్టీసీ ఉద్యోగి లక్ష్మణ్‌ను మంగళవారం నియమించారు. నాలుగు నెలలుగా కంట్రోలర్ లేకపోవడంతో ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులుపై ఫిబ్రవరి 28న ‘బస్టాండ్‌పై పట్టింపేది..?’ అనే శీర్షికతో ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన స్థానిక ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు డిపో మేనేజర్ రాజశేఖర్‌తో కలిసి ఈ నెల 2న బస్టాండ్‌ను సందర్శించారు. పారిశుద్ధ్యం, ఫ్యాన్లు పనిచేయకపోవడం, ఇతర సౌకర్యాలు పరిశీలించి ఆర్టీసీ అధికారులకు సూచనలు చేశారు. ఈ క్రమంలోనే ఆర్టీసీ ఉద్యోగిని కంట్రోలర్‌గా నియమించారు. అలాగే మరమ్మతులు చేపట్టడంతో మంగళవారం నుంచి ఫ్యాన్లు తిరుగుతున్నాయి.


