ఆసిఫాబాద్‌అర్బన్: వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడంలో లైన్‌మెన్ల పాత్ర వెలకట్టలేనిదని ఆసిఫాబాద్ సర్కిల్ సూపరింటెండెంట్ ఉత్తమ్ జాడె అన్నారు. జిల్లా కేంద్రంలోని సబ్ స్టేషన్‌లో బుధవారం లైన్‌మెన్ దివస్ ఘనంగా నిర్వహించారు. ఆసిఫాబాద్, వాంకిడి, రెబ్బెన మండలాలకు చెందిన విద్యుత్ లైన్‌మెన్లు, సిబ్బందిని శాలువాతో సత్కరించి ప్రశంసాపత్రాలు అందించారు. విధులు నిర్వహించే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేశారు. కార్యక్రమంలో ఏఈ లక్ష్మి రాజ్యం, ఊర్మిల, సిబ్బంది పాల్గొన్నారు.


