ఆర్జీయూకేటీ విద్యార్థులకు సిమెన్స్‌ స్కాలర్‌షిప్‌ | - | Sakshi
Sakshi News home page

ఆర్జీయూకేటీ విద్యార్థులకు సిమెన్స్‌ స్కాలర్‌షిప్‌

Mar 6 2026 8:14 AM | Updated on Mar 6 2026 8:14 AM

బాసర:నిర్మల్‌ జిల్లా బాసర ఆర్జీయూకేటీ ఇంజినీరింగ్‌ విద్యార్థులు సిమెన్స్‌ ఇండియా నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక స్కాలర్‌షిప్‌ ప్రోగ్రాంలో చోటు సంపాదించారు. యువ ప్రతిభలను ప్రోత్సహించి, ఆధునిక టెక్నాలజీ నాయకులుగా తీర్చిదిద్దడం ఈ కార్యక్రమ లక్ష్యం. ఎంపికై న విద్యార్థులకు ఆర్థిక సహాయంతోపాటు వృత్తి అభివృద్ధి అవకాశాలు అందుతాయి.

స్కాలర్‌షిప్‌ ప్రయోజనాలు

ఈ పథకం విద్యార్థులకు సమగ్ర మార్గదర్శకత్వం అందిస్తుంది. పూర్తి ఆర్థిక సహకారం విద్యా ఖర్చులకు. పరిశ్రమ నిపుణుల ప్రత్యక్ష మెంటర్‌షిప్‌. అధునాతన సాంకేతిక శిక్షణ, ప్రాక్టికల్‌ అనుభవం. ప్రముఖ సంస్థల్లో ఇంటర్న్‌షిప్‌లు, ఆధునిక ఇంజినీరింగ్‌ పద్ధతులపై అవగాహన కల్పిస్తారు. ఈ అవకాశాలు విద్యార్థుల కెరీర్‌ను ఉన్నత స్థాయికి తీసుకెళ్తాయి. ఇన్‌చార్జి వీసీ ప్రొఫెసర్‌ ఎ.గోవర్ధన్‌, ఓఎస్డీ ప్రొఫెసర్‌ ఇ.మురళీదర్శన్‌ స్కాలర్‌షిప్‌కు ఎంపికై న బి.శ్వేత, సమీనా, చిన్నారెడ్డి, శ్యామ్‌, హిమబిందును అభినందించారు. ఈ అవకాశం వారి కెరీర్‌ శిఖరాలు, దేశ సాంకేతిక పురోగతికి దోహదపడుతుందని ఆకాంక్షించారు. స్కాలర్‌షిప్‌ సెక్షన్‌ ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ ఎస్‌.విఠల్‌, డాక్టర్‌ టి.రాకేశ్‌రెడ్డి, డాక్టర్‌ బావ్‌సింగ్‌తోసహా సిబ్బంది అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement