సమస్యలు పరిష్కరించాలని వీవోఏల నిరసన | - | Sakshi
Sakshi News home page

సమస్యలు పరిష్కరించాలని వీవోఏల నిరసన

Mar 17 2026 7:43 AM | Updated on Mar 17 2026 7:43 AM

ఆసిఫాబాద్‌రూరల్‌: ఐకేపీ వీవోఏల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి రాజేందర్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ ఎదుట సోమవారం వీవోఏలతో కలిసి నిరసన తెలిపారు. అనంతరం కలెక్టర్‌ కె.హరితకు వినతిపత్రం అందించారు. ఆయన మాట్లాడుతూ వీవోఏలకు సమాన పనికి సమాన వేతనం రూ.26వేలు చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, ఈఎస్‌ఐ, పీఎఫ్‌ అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కృష్ణమాచారి, నాయకులు ధనరాజ్‌, అంకన్న, తిరుపతి, రాంచందర్‌, సుజాత తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement