రెబ్బెన: మండలంలోని ఇందిరానగర్‌లో గల కనకదుర్గాదేవి, స్వయంభూ మహంకాళి ఆలయంలో ఏప్రిల్ 2, 3 తేదీల్లో నిర్వహించే జాతరను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. ఆలయ కమిటీ సభ్యులు సోమవారం జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యేను కలిసి ఆహ్వాన పత్రిక అందించారు. ఎమ్మెల్యే చేతుల మీదుగా జాతర పోస్టర్లను ఆవిష్కరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వయంభూగా వెలిసిన మహంకాళి ఆలయంలో చైత్రపౌర్ణమి అమ్మవారి పుట్టిన రోజు సందర్భంగా ఏటా జాతర మహోత్సవం నిర్వహిస్తున్నారని తెలిపారు. ఏప్రిల్ 2, 3 తేదీల్లో జాతర నిర్వహణకు ఆలయ కమిటీ ఏర్పాట్లు చేస్తోందన్నారు. కార్యక్రమంలో ఆసిఫాబాద్ మున్సిప ల్ చైర్మన్ అకాశ్, వైస్ చైర్మన్ ఎండీ అహ్మద్, ఆలయ కమిటీ అధ్యక్షుడు మోడెం తిరుపతిగౌడ్, ఆలయ ప్రధాన అర్చకులు దేవార వినోద్ స్వామి, సభ్యులు దుర్గం తిరుపతి, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.


