రెబ్బెన: విద్యాశాఖలో పనిచేస్తున్న సీఆర్పీల ను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఏఐ టీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్, సీఆర్పీ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మిట్ట దేవేందర్ డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం వినతిపత్రం అందించా రు. వారు మాట్లాడుతూ 13 ఏళ్లుగా విద్యాభివృద్ధికి సీఆర్పీలు ఎంతో కృషి చేస్తున్నారన్నా రు. ఎన్నికల హామీ మేరకు షరతులు లేకుండా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, పర్మినెంట్ చేసే వరకు కనీస టైం స్కేల్ ఇవ్వాలని, పీఎఫ్, ఆరోగ్య బీమా కల్పించాలని డి మాండ్ చేశారు. సీఆర్పీలకు జిల్లా, అంతర్ జిల్లాల బదిలీలకు అవకాశం కల్పించాలని కోరారు. చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు.


