అనుమతి లేకుండా తరలిస్తే కేసులు | - | Sakshi
Sakshi News home page

అనుమతి లేకుండా తరలిస్తే కేసులు

Mar 10 2026 7:19 AM | Updated on Mar 10 2026 7:19 AM

పెంచికల్‌పేట్‌: మండలంలోని పెద్దవాగు నుంచి జ రుగుతున్న ఇసుక అక్రమ రవాణాపై ఈ నెల 7వ తేదీన ‘సాక్షి’లో ప్రచురితమైన ‘ఇసుక తోడేళ్లు’ అనే కథనానికి భూగర్భ గనులశాఖ, రెవెన్యూ అధికారులు స్పందించారు. అనుమతులు లేకుండా పెద్దవాగు నుంచి ఇసుక రవాణా చేస్తే కేసులు నమోదు చేస్తామని తహసీల్దార్‌ తిరుపతి సోమవారం హెచ్చరించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు కార్యాలయంలో టోకెన్లు అందిస్తామని స్పష్టం చేశారు. పరిశ్రమలకు తరలిస్తున్న ఇసుక ఒక్కో ట్రాక్టరుకు రూ.1400 చొప్పున బ్యాంకులో డీడీ చెల్లించాలని ఆయన సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement