రెబ్బెన: బొగ్గు ఉత్పత్తిలో ముందంజలో ఉన్న బెల్లంపల్లి ఏరియా కార్మికులకు యాజమాన్యం ప్రోత్సాహక బహుమతులు ఇవ్వాలని హెచ్‌ఎంఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు పత్తెం రాజాబాబు కోరారు. మంగళవారం ఖైరిగూర ప్రాజెక్టు అధికారి మచ్చగిరి నరేందర్‌ను కలిసి వినతిపత్రం అందించారు. ఆయన మాట్లాడుతూ సింగరేణి వ్యాప్తంగా బెల్లంపల్లి ఏరియా 126 శాతం ఉత్పత్తి సాధించిందని తెలిపారు. వచ్చే ఏడాది సైతం నిర్దేశిత వార్షిక లక్ష్యాన్ని అధిగమించడం, అధికంగా ఉత్పత్తి చేసే విధంగా కార్మికులను ప్రోత్సాహించాలని అన్నారు. కిలో స్వీట్ బాక్స్, ఒక వెండి నాణెం బహుమతిగా అందించాలని కోరారు. తద్వారా కార్మికులు ఉత్సాహంగా పనిచేస్తారని తెలిపారు.


