విద్యార్థులు ఒత్తిడికి గురికావొద్దు | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులు ఒత్తిడికి గురికావొద్దు

Mar 12 2026 7:40 AM | Updated on Mar 12 2026 7:40 AM

లింగాపూర్‌: పదో తరగతి విద్యార్థులు వార్షిక పరీక్షల సమయంలో ఒత్తిడికి గురికావొద్దని ఏఎస్పీ చిత్తరంజన్‌ అన్నారు. పోలీసులు మీకోసం కార్యక్రమంలో భాగంగా బుధవారం మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ విద్యాలయంలో జెడ్పీ ఉన్నత పాఠశాల, కంచన్‌పల్లి ఆశ్రమ పాఠశాల, కేజీబీవీ విద్యార్థులకు పెన్నులు, ప్యాడ్‌లు, వాటర్‌ బాటిళ్లు పంపిణీ చేశారు. పదో తరగతి విద్యార్థులు ఏకాగ్రతతో చదివి ఉత్తమ మార్కులు సాధించాలని సూచించారు. కార్యక్రమంలో సీఐ రమేశ్‌, ఎస్సై గంగన్న, కేజీబీవీ ఎస్‌వో మీనా కుమారి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ప్రశాంతంగా పరీక్షలు రాయాలి

రెబ్బెన: పదో తరగతి విద్యార్థులు ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా వార్షిక పరీక్షలు రాయాలని ఏఎస్పీ చిత్తరంజన్‌ అన్నారు. రెబ్బెన మండల కేంద్రంలోని టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్‌ విద్యార్థులకు బుధవారం పరీక్ష సామగ్రి అందించారు. ఆయన మాట్లాడుతూ పదో తరగతి తర్వాత ఐదేళ్ల కెరీర్‌ను ఈ పరీక్షలు ప్రభావితం చేస్తాయని తెలిపారు. పదో తరగతిలో సాధించే మార్కులపై ఉన్నత చదువులు ఆధారపడతాయని వివరించారు. కార్యక్రమంలో రెబ్బెన సీఐ సంజయ్‌, ఎస్సై వెంకటకృష్ణ, గురుకుల ప్రిన్సిపాల్‌ చైతన్య, సీఆర్పీ మిట్ట దేవేందర్‌, ఉపాధ్యాయులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

ఉత్తమ ఫలితాలు సాధించాలి

వాంకిడి: పదో తరగతి విద్యార్థులు ప్రణాళికతో చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని ఏఎస్పీ చిత్తరంజన్‌ అన్నారు. మండల కేంద్రంలోని జెడ్పీఎస్‌ఎస్‌లో బుధవారం పదో తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షలపై సూచనలు చేశారు. 400 మందికి పరీక్ష సామగ్రి పంపిణీ చేశారు. సీఐ సత్యనారాయణ, ఎస్సై మహేందర్‌, ఎంఈవో శివచరణ్‌, హెచ్‌ఎం నటరాజ్‌ పాల్గొన్నారు.

పరీక్ష సామగ్రి పంపిణీ

కెరమెరి: మండలంలోని మోడి కేజీబీవీలో బుధవారం పోలీసులు మీకోసం కార్యక్రమంలో భాగంగా ఏఎస్పీ చిత్తరంజన్‌ 250 మంది విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు, వాటర్‌ బాటిళ్లు, పెన్నులు అందించారు. అలాగే జైనూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో 450, సిర్పూర్‌(యు) పరిధిలో 70 మంది విద్యార్థులకు సామగ్రి పంపిణీ చేశారు. కార్యక్రమంలో సీఐ సత్యనారాయణ, ఎస్సై ఎన్‌.మధుకర్‌, సర్పంచ్‌ ఆత్రం లక్ష్మణ్‌, హెచ్‌ఎం ప్రేందాస్‌, కేజీబీవీ ఎస్‌వో ప్రవీణ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement