వర్క్‌షాప్‌ మూసివేసే చర్యలు మానుకోవాలి | - | Sakshi
Sakshi News home page

వర్క్‌షాప్‌ మూసివేసే చర్యలు మానుకోవాలి

Mar 12 2026 7:40 AM | Updated on Mar 12 2026 7:40 AM

రెబ్బెన: బెల్లంపల్లి ఏరియాలోని మాదారం, గోలేటి భూగర్భ గనులు, ఉపరితల గనులకు అనేక రకాలుగా ఉపయోగపడిన వర్క్‌షాప్‌ను మూసివేసే చర్యలను వెంటనే మానుకోవాలని హెచ్‌ఎంఎస్‌ ఏరియా ఉపాధ్యక్షుడు పత్తెం రాజాబాబు డిమాండ్‌ చేశారు. వర్క్‌షాప్‌ డీజీఎం జ్ఞానేశ్వర్‌ను బుధవారం కలిసి వినతిపత్రం అందించారు. ఆయన మాట్లాడుతూ ఏరియా వర్క్‌షాప్‌ను మూసివేసే దిశగా సూపర్‌వైజర్లు, టెక్నీషన్లను యాజమాన్యం ఖైరిగూర ఓసీపీకి బదిలీ చేస్తే అడ్డుకోవాల్సిన ఏఐటీయూసీ నాయకత్వం పట్టింపు లేనట్లుగా వ్యవహరిస్తుందన్నారు. సేఫ్టీ, మైన్స్‌, జీఎం కమిటీల్లో ఐఈడీ ప్రకారం ఏరియా వర్క్‌షాప్‌లో సూపర్‌వైజర్లు, టెక్నీషన్లు తక్కువగా ఉన్నారని తెలిపారు. కార్యక్రమంలో ఏరియా ఆర్గనైజర్‌ ఎస్‌కే ఇనూస్‌, ఆర్గనైజర్లు రాజశేఖర్‌, సంతోష్‌, శేఖర్‌, కల్యాణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement