ఆసిఫాబాద్‌అర్బన్: గృహ వినియోగం, కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధర పెంపుపై జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ చౌక్ వద్ద బుధవారం సీపీఎం నాయకులు ఖాళీ గ్యాస్ సిలిండర్లతో నిరసన తెలిపారు. సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు దుర్గం దినకర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలతో యుద్ధ సమయంలో ధరలు పెంచిందని మండిపడ్డారు. అమెరికా మెప్పు కోసం మిత్ర దే శాలతో శతృత్వం పెంచుకోవడం సరికాదన్నా రు. సామాన్యులు, మధ్య తరగతి ప్రజల కో సం గ్యాస్ ధరల పెంపు నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు గొడిసెల కార్తీక్, టీకానంద్, నాయకులు నిఖిల్, రాజ్‌కుమార్, పవన్, మహిళలు పాల్గొన్నారు.


