కాగజ్‌నగర్‌టౌన్: నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకే సిర్పూర్ పేపర్ మిల్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో సోషల్ రెస్పాన్సిబిలిటీ కార్యక్రమాల్లో భాగంగా టైలరింగ్, కంప్యూటర్ శిక్షణలు అందిస్తున్నామని జీఎం హెచ్‌ఆర్ ఎంఎస్ గిరి తెలిపారు. పట్టణంలోని హెచ్‌ఆర్డీ హాల్‌లో టైలరింగ్, కంప్యూటర్ శిక్షణ పొందిన 214 మంది యువతీ యువకులకు బుధవారం సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ స్థానిక యువతలో నైపుణ్యాలు అభివృద్ధి చేయడం శిక్షణ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. కార్యక్రమంలో మిల్లు ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.


