ఆసిఫాబాద్: జిల్లా కేంద్రంలోని కోర్టు సముదాయంలో ఈ నెల 28న జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ జడ్జి ఏ.వీరయ్య తెలిపారు. జిల్లా కేంద్రంలోని కోర్టు భవన సముదాయంలో బార్ అసోసియేషన్ ప్రతినిధులు, పోలీసు, అటవీ, ఎకై ్సజ్ శాఖ అధికారులతో బుధవారం సన్నాహక సమావేశం నిర్వహించారు. ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ జడ్జి మాట్లాడుతూ లోక్‌అదాలత్‌లో రాజీమార్గం ద్వారా క్రిమినల్, సివిల్, ప్రీలిటిటేషన్, భూతగాదాలు, వివిధ కేసులు పరిష్కరించనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సమావేశంలో సీనియర్ సివిల్ జడ్జి యువరాజ, న్యాయవాదులు, పోలీసు అధికారులు పాల్గొన్నారు.


