కార్యకర్తలు సమన్వయంతో పని చేయాలి | - | Sakshi
Sakshi News home page

కార్యకర్తలు సమన్వయంతో పని చేయాలి

Mar 12 2026 7:40 AM | Updated on Mar 12 2026 7:40 AM

● డీసీసీ అధ్యక్షురాలు సుగుణ

పెంచికల్‌పేట్‌: కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో సమన్వయంతో పని చేయాలని డీసీసీ అధ్యక్షురాలు సుగుణ అన్నారు. మండల కేంద్రంలో ఎమ్మెల్సీ దండె విఠల్‌తో కలిసి బుధవారం కార్యకర్తల సమావేశం నిర్వహించారు. డీసీసీ అధ్యక్షురాలు మాట్లాడుతూ కాంగ్రెస్‌ హయాంలో గ్రా మాలు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయన్నారు. ప్రభుత్వ పథకాలు అర్హులకు చేరేలా ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. కష్టపడే కార్యకర్తలకు పార్టీ గుర్తింపును ఇస్తుందని పేర్కొన్నారు. అనంతరం ఎమ్మెల్సీ మాట్లాడుతూ రానున్న రోజుల్లో కాంగ్రెస్‌ పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యమన్నారు. అనంతరం కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడిగా సముద్రాల రాజన్నను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నియామక పత్రం అందించి శాలు వాతో సన్మానించారు. పెంచికల్‌పేట్‌ సర్పంచ్‌ షేక్‌ ఉస్మాన్‌, నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement