కాగజ్‌నగర్‌టౌన్: కాగజ్‌నగర్ పట్టణ పరిధి లో సమస్యలు పరిష్కరించాలని మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ కొత్తపల్లి అనిత, బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో సోమవారం కలెక్టర్ కె.హరితకు వినతిపత్రం అందించారు. పట్టణంలో తాగునీటి సరఫరాలో లోపాలు, గుంతల రోడ్లు, మురుగు కాలువల శుభ్రత, స్ట్రీట్‌లైట్ల ఏర్పాటు తదితర అంశాలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. సానుకూలంగా స్పందించిన కలెక్టర్ అధికారులతో చర్చించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీ సుకుంటామని అన్నారు. కార్యక్రమంలో కౌ న్సిలర్లు సీపీ విద్యావతి, వలీ, వనమాల శ్రీధర్, వసీం, బాబురావు పాల్గొన్నారు.


