కాగజ్‌నగర్‌టౌన్: కాగజ్‌నగర్ మున్సిపల్ చైర్‌పర్సన్ చాంబర్‌లోకి అనధికారిక వ్యక్తులు ప్ర వేశించి మున్సిపల్ కార్యకలాపాలకు ఆటంకం కలగిస్తున్నారని మున్సిపల్ వైస్ చైర్‌పర్స న్ డాక్టర్ కొత్తపల్లి అనిత, బీఆర్‌ఎస్ కౌ న్సిల ర్లు ఆరోపించారు. దీనిపై శనివారం అడిషన ల్ కలెక్టర్ డేవిడ్‌తోపాటు మున్సిపల్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడతూ.. ప్రజల సమస్యలు పరిష్కరించాల్సిన అధికారిక స్థలాన్ని వ్యక్తిగత, రాజకీ య కార్యక్రమాల కోసం ఉపయోగి స్తున్నార ని ఆరోపించారు. దీంతో మున్సిపల్ కార్యాల య గౌవరం దెబ్బతింటోందని తెలిపారు. ప్ర జల్లోకి తప్పుడు సందేశం వెళ్తోందని పేర్కొన్నారు. మున్సిపాలిటీ పరిపాలన సక్రమంగా సాగేందుకు చైర్‌పర్సన్ చాంబర్‌ను అధికారిక అవసరాలకే పరిమితం చేయాలని కోరారు.


