ఆసిఫాబాద్‌అర్బన్: పరిశుభ్రత అందరి బాధ్యత అని కలెక్టర్ కె.హరిత అన్నారు. ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ పరిసర ప్రాంతాల్లో అదనపు కలెక్టర్ ఎం.డేవిడ్, జిల్లా అధికారులు, సిబ్బందితో కలిసి చెత్తను సేకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రతను ప్రతిఒక్క రూ బాధ్యతగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఉద్యోగులు కార్యాలయాల పరిసరాల్లో పరిశుభ్రత పాటిస్తూ.. ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలతో పారిశుద్ధ్యం లోపించడంతోపాటు పర్యావరణంపై కూడా తీవ్ర ప్రభా వం పడుతుందని తెలిపారు. ఎక్కడైనా చెత్త కనిపి స్తే విధిగా డస్ట్‌బిన్‌లో వేయాలని సూచించారు. ప్రజలు చెత్తను రోడ్లపై కాకుండా మున్సిపల్, పంచాయతీల చెత్త సేకరణ వాహనాల్లో వేయాలన్నా రు. అనంతరం పర్యావరణ పరిరక్షణపై అధికారులు, సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో డీఆర్‌డీవో దత్తారావు, ఆర్డీవో లోకేశ్వర్‌రావు, డీడబ్ల్యూవో భాస్కర్, డీటీడీవో రమాదేవి, హర్టికల్చర్ అధికారి నదీమ్, మత్స్యశాఖ అధికారి సాంబశివరావు, వెటర్నరీ అధికారి సురేశ్, ఇతర శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
మహంకాళి జాతరకు ఆహ్వానం
ఆసిఫాబాద్‌అర్బన్: రెబ్బెన మండలం ఇందిరానగర్‌లోని శ్రీ కనకదుర్గాదేవి స్వయంభూ మహంకాళి దేవస్థానంలో ఏప్రిల్ 2న నిర్వహించే జాతరకు హాజరుకావాలని ఆలయ అర్చకుడు దేవర వినోద్, నిర్వాహకులు కలెక్టర్ హరితను ఆహ్వానించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో శుక్రవారం కలెక్టర్‌తో కలిసి జాతర పోస్టర్లు ఆహ్వానించారు. ఏప్రిల్ 2న శివపార్వతుల కల్యాణ మహోత్సవం, 3న జాతర కొనసాగుతుందని తెలిపారు.


