ఆసిఫాబాద్: కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవ డం అత్యంత అవసరమని నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ పద్మలత అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో శుక్రవారం నీటికాసుల(గ్లాకోమా) వ్యాధిపై అవగాహన కల్పించారు. ప్రిన్సిపాల్ మాట్లాడుతూ నీటికాసుల లక్షణాలను ప్రారంభ దశలోనే గుర్తించాలన్నారు. తద్వారా శాశ్వత దృష్టిలోపాన్ని నివారించవచ్చని పేర్కొన్నారు. క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. వ్యాధి లక్షణాలు, కారణాలు, నివారణ పద్ధతులను వివరించారు. కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రవీణ్ కుమార్, నర్సింగ్ కళాశాల సూపరింటెండెంట్ అనంతుల్లా, విజయ పాల్గొన్నారు.


