చెడు అలవాట్లతో జీవితాలు నాశనం | - | Sakshi
Sakshi News home page

చెడు అలవాట్లతో జీవితాలు నాశనం

Mar 10 2026 7:19 AM | Updated on Mar 10 2026 7:19 AM

ఆసిఫాబాద్‌రూరల్‌: చెడు అలవాట్లతో విద్యార్థుల జీవితాలు నాశనమవుతాయని జిల్లా అకడమిక్‌ మానిటరింగ్‌ అధికారి శ్రీనివాస్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో సోమవారం జిల్లాలోని 20 పాఠశాలల ప్రహరీ క్లబ్‌ విద్యార్థులు, ఉపాధ్యాయులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. యువత దేశ భవిష్యత్తు అని, మన ఆరోగ్యం బాగుంటేనే భవిష్యత్తు బాగుంటుందన్నారు. విద్యార్థులు క్రీడలు ఆడటం, పుస్తకాలు చదవడం, సృజనాత్మక ఆలోచనలతో మంచి అలవాట్లు పెంపొందించుకోవాలని సూచించారు. సీఐ రవీందర్‌, ఎస్సై రవికుమార్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement