ఆసిఫాబాద్‌రూరల్: జిల్లా విద్యాశాఖ అధికారి(డీఈవో)గా లలిత మంగళవారం జిల్లా కేంద్రంలో పూర్తిస్థాయి బాధ్యతలు స్వీకరించారు. ఇన్‌చార్జి డీఈవోగా బాధ్యతలు నిర్వర్తించిన అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) దీపక్ తివారి బదిలీ కావడంతో మరో అదనపు కలెక్టర్(రెవెన్యూ) డేవిడ్‌కు తాత్కాలికంగా బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మంచిర్యాల జిల్లాలో ఏడీగా పనిచేస్తున్న లలితను జిల్లాకు బదిలీ చేశారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం కలెక్టరేట్‌లో కలెక్టర్ కె.హరితను మర్యాదపూర్వకంగా కలిసి మొక్క అందించారు. డీఈవో కార్యాలయ సిబ్బంది నూతన డీఈవోను శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో ఏడీ శ్రీనివాస్, ఎస్‌వోలు శ్రీనివాస్, దేవాజీ, లతీఫ్, వరప్రసాద్, జనార్దన్, రాము తదితరులు పాల్గొన్నారు.


