రాబందులను సంరక్షించడానికి అటవీశాఖ అధి కారులు గతంలో ‘జటాయువు’ పేరుతో కార్యక్రమానికి ప్రతిపాదనలు పంపారు. ఇందులో భా గంగా వాటి రక్షణకు సిబ్బంది నియామకం, వేటగాళ్ల ప్రవేశంపై నిషేధం, సంరక్షణ కేంద్రం చుట్టూ కంచె ఏర్పాటు, ఆహారం అందించడం వంటి అంశాలను జిల్లా అధికారులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి అనుమతులు రాకపోవడంతో రాబందుల సంరక్షణ కేంద్రం పనులు ముందు కు సాగడం లేదు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి, అరుదైన జాతుల సంరక్షణకు నిధులను కేటాయించి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పక్షి ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు.


