పకడ్బందీగా నిర్వహించాలి | - | Sakshi
Sakshi News home page

పకడ్బందీగా నిర్వహించాలి

Mar 6 2026 8:13 AM | Updated on Mar 6 2026 8:13 AM

● కలెక్టర్‌ కె.హరిత

● కలెక్టర్‌ కె.హరిత

జిల్లాలో శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమం పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్‌ కె.హరిత అన్నారు. గురువారం హైదరాబాద్‌ నుంచి జూ మ్‌ మీటింగ్‌ ద్వారా అదనపు కలెక్టర్‌ డేవిడ్‌, జి ల్లాలోని ఎంపీడీవోలు, మున్సిపల్‌ కమిషనర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మా ట్లాడుతూ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలపై క్షేత్రస్థాయిలో వివిధ శాఖల ఆధ్వర్యంలో చేపట్టా ల్సిన అభివృద్ధి పనులపై కార్యాచరణ రూపొందించాలన్నారు. 10 అంశాలపై 99 రోజుల పా టు కార్యక్రమం కొనసాగుతుందని, పట్టణాలు, గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టాలన్నారు. పెండింగ్‌ ఫైళ్లు పరిష్కరించాలన్నారు. మార్చి 8న ప్రపంచ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు, వార్డు సభ్యులు, మున్సిపల్‌ చైర్‌పర్సన్లు, కౌన్సిలర్లు, ఎమ్మెల్యేలు భాగస్వాములై విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవోలు, మున్సిపల్‌ కమిషనర్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement