జిల్లా పాలనలోనూ.. | - | Sakshi
Sakshi News home page

జిల్లా పాలనలోనూ..

Mar 8 2026 7:31 AM | Updated on Mar 8 2026 7:31 AM

మహిళలు నిబద్ధతతో పనిచేస్తారు

ప్రజాసమస్యలను నా సమస్యగా భావించి పరిష్కారానికి కృషి చేస్తున్నాను. గ్రీవెన్స్‌ విభాగానికి వచ్చే సమస్యలను ఫాలోఅప్‌ చేస్తూ బాధితుల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నాను. ప్రకృతితో నిండి ఉన్న జిల్లాలో పని చేయడం చాలా సంతోషంగా ఉంది. విధి నిర్వహణలో ట్రావెల్‌ చేయడం కష్టమనిపించదు. మగవారి కంటే మహిళలు ఎంతో నిబద్ధతతో పనిచేస్తారు.

– కె.హరిత, కలెక్టర్‌

జిల్లాపై ఎస్పీది ప్రత్యేక ముద్ర

బాధ్యతలు స్వీకరించిన నుంచి ఎస్పీ నితిక పంత్‌ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జిల్లాలో గ్రామపంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికలను విజయవంతంగా పూర్తి చేశారు. నిషేధిత మత్తు పదార్థాలు, గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపుతూ బాలికల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠినంగా వ్యవహరిస్తూ తనదైన ముద్ర వేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement