కాగజ్‌నగర్‌టౌన్: కాగజ్‌నగర్ బస్టాండ్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఎమ్మెల్యే పా ల్వాయి హరీశ్‌బాబు అన్నారు. పట్టణంలోని బస్టాండ్‌ను సోమవారం ఆసిఫాబాద్ డిపో మేనేజర్ రాజశేఖర్‌తో కలిసి తనిఖీ చేశారు. బస్టాండ్‌లోని మూత్రశాలలు, తాగునీటి వస తి, సైకిల్ స్టాండ్ పరిసరాలను పరిశీలించా రు. బస్టాండ్ ఆవరణలో నీరు నిలిచి దుర్గంధం వ్యాపిస్తుందని, ఆర్టీసీ అధికారులు పర్యవేక్షణ లేకనే బస్టాండ్ అపరిశుభ్రంగా తయారవుతుందని మండిపడ్డారు. ఆర్టీసీ బస్టాండ్ పరిశుభ్రంగా ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బస్టాండ్ అభివృద్ధి కోసం ప్రతిపాదనలు అందిస్తే నిధుల మంజూరుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.


