నస్పూర్/మంచిర్యాలరూరల్(హాజీపూర్): మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు అన్నారు. శనివారం ఆయన ప్రజాపాలన ప్రగతి–ప్రణాళికలో భా గంగా కమిషనర్ అన్వేష్, మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్యతో కలిసి 30, 16వ డివిజన్లలో పర్యటించారు. 30వ డివిజన్‌లో వీధి దీపాలు వెలుగడం లేదని స్థానికులు తెలుపగా ఎమ్మెల్యే వెంటనే ఏఈ రాంచందర్‌కు ఫోన్ చేసి సమస్య పరిష్కరించాలని సూచించారు. విలేజ్ శ్రీరాంపూర్ బస్టాప్ వద్ద బస్సులు నిల పడం లేదని మహిళలు దృష్టికి తీసుకు రాగా.. డిపో మేనేజర్ శ్రీనివాస్‌కు ఫోన్ చేసి బస్సులు నిలపాలని ఆదేశించారు. కార్పొరేటర్లు శ్రీనివాస్, త్రివేణి ఉన్నారు.


