ఆసిఫాబాద్‌రూరల్: జిల్లా కేంద్రంలోని ఆదర్శ క్రీడాపాఠశాలలో బుధవారం ఉమ్మడి జిల్లాస్థాయి హ్యాండ్‌బాల్ ఎంపిక పోటీలు హోరాహోరీగా సాగాయి. ఈ పోటీలకు వివిధ ప్రాంతాల నుంచి 100 మంది క్రీడాకారులు హాజరు కాగా, ఉత్తమ ప్రతిభ చూపిన 20 మందిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశామని హ్యాండ్‌బాల్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రమేశ్, కోచ్ అరవింద్ తెలిపారు. ఎంపికై న వారికి మరో వారంపాటు కోచింగ్ క్యాంపు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ నెల 13 నుంచి 15 వరకు హైదరాబాద్‌లో నిర్వహించే రాష్ట్రస్థాయి హ్యాండ్‌బాల్ పోటీల్లో వీరు పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లికార్జున్, ఏసీఎంవో ఉద్దవ్, డీఎస్‌వో షేకు, కోచ్ విద్యాసాగర్, హెచ్‌ఎం జంగు, పీడీలు రాకేశ్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.


