ఆసిఫాబాద్‌అర్బన్: ప్రజావాణి కార్యక్రమంలో స్వీకరించిన వినతులను వేగంగా పరిష్కరిస్తామని కలెక్టర్ కె.హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో గల ఎన్‌ఐసీ వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అధికారులతో కలిసి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎలాంటి ఆధారం లేని తనకు పింఛన్ మంజూరు చేయాలని రెబ్బెన మండలం వంకులం గ్రామానికి చెందిన బోర్కుటె భీంరావ్ విన్నవించారు. కాగజ్‌నగర్ మండలం భట్టుపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుల్లో జరిగిన అక్రమాలపై విచారణ చేపట్టాలని సర్పంచ్ జాదవ్ రాజేందర్ ఫిర్యాదు చేశారు. కాగజ్‌నగర్ మండలం రాస్పెల్లి గ్రామంలోని మీసేవ కేంద్రాన్ని రద్దు చేయాలని కోటేష్ కోరాడు. ఒంటరి మహిళ పింఛన్ మంజూరు చేయాలని రెబ్బెన మండలం వంకులం గ్రామానికి చెందిన సవిత, దివ్యాంగుల పింఛన్ మంజూరు చేయాలని కౌటాల మండలం కన్నెపల్లి గ్రామానికి చెందిన నగేశ్ వేర్వేరుగా వినతులు సమర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రతీ దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని ఆదేశించారు.
పట్టా పాస్‌పుస్తకం ఇప్పించండి
రెబ్బెన మండలం తక్కలపల్లి గ్రామ శివారులో సర్వే నం.122/1/2లో ఎకరం భూమి ఉంది. గతంలో ఉన్న సర్వే నంబర్‌లో తక్కువ భూమి ఉంది. భూమి మొత్తం వివరాలను పొందిపర్చి నూతన పట్టాపాసు పుస్తకం ఇప్పంచాలి. – టేకం భుజంగ్‌రావు, తక్కళ్లపల్లి, మం.రెబ్బెన


