ఆసిఫాబాద్‌అర్బన్: ఆసిఫాబాద్ మున్సిపాలి టీ పరిధిలోని ప్రజలు పెండింగ్‌లో ఉన్న ఇంటి, ఇతర పన్నులు సకాలంలో చెల్లించాలని కమిషనర్ గజానంద్ కోరారు. గురువారం మున్సిపల్ పరిధిలోని పలు వార్డులో ఇంటింటికి వెళ్తూ యజమానుల వద్ద నుంచి బకాయి పన్నులు వసూలు చేశారు. ఆయన మాట్లాడుతూ 20 వార్డుల్లో పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తున్నామని, దోమల నివారణకు ఫాగింగ్ చేస్తున్నామన్నారు. ఇతర సమస్యలను కూడా పాలకవర్గం సహకారంతో త్వరగా పరిష్కరిస్తామని తెలిపారు. కార్యక్రమంలో సిబ్బంది ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.


