రోగులకు మెరుగైన చికిత్స అందించాలి | - | Sakshi
Sakshi News home page

రోగులకు మెరుగైన చికిత్స అందించాలి

Mar 18 2026 7:45 AM | Updated on Mar 18 2026 7:45 AM

● కలెక్టర్‌ కె.హరిత

తిర్యాణి: ఆస్పత్రులకు వచ్చే రోగులకు మెరుగైన చికిత్స అందించాలని కలెక్టర్‌ కె.హరిత అన్నారు. మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌ను మంగళవారం నీతి ఆయోగ్‌ కేంద్ర ప్రతినిధి ఆశ్ల శర్మతో కలిసి తనిఖీ చేశారు. ఆపరేషన్‌ థియేటర్‌, రోగుల వార్డులు, మందుల నిల్వ గది, ప్రసూతి పట్టికను పరిశీలించారు. నెలల వారీగా జరుగుతున్న ప్రసవాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలోని శుద్ధజల యంత్రానికి వెంటనే మరమ్మతులు చేపట్టి వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు. ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా 9 నుంచి 14 ఏళ్లలోపు బాలికలకు హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ అందించాలన్నారు. ఈ వ్యాక్సిన్‌ ద్వారా గర్భాశయ క్యాన్సర్‌ను నిరోధించవచ్చన్నారు. అనంతరం మండల కేంద్రంలో సంపూర్ణత అభియాన్‌లో భాగంగా పశువులకు ఉచితంగా అందిస్తున్న గాలికుంటు నిరోధక టీకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. జంగుబాయి మండల సమైక్య భవన నిర్మాణ పనులను పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి రమాదేవి, ఎంపీడీవో వేముల మల్లేశ్‌, ఏపీఎం శ్రీనివాస్‌, సంపూర్ణత అభియాన్‌ జిల్లా సమన్వయకర్త బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

పగటిపూట వీధిలైట్లు వెలగనీయొద్దు

ఆసిఫాబాద్‌రూరల్‌: గ్రామాల్లో పగటిపూట వీధిలైట్లు వెలగకుండా నియంత్రించాలని కలెక్టర్‌ హరిత అన్నారు. మండలంలోని చిర్రకుంట, పాడిబండ పంచాయతీలను మంగళవారం సందర్శించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ వీధిదీపాలు పగలు వెలకుండా మరమ్మతులు చేపట్టి, ఆన్‌ఆఫ్‌ స్విచ్‌లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పంచాయతీల అభివృద్ధికి కార్యదర్శులు సర్పంచుల సహకారం తీసుకోవాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement