ఆసిఫాబాద్: అదనపు కలెక్టర్‌గా దీపక్ తివారి అందించిన సేవలు మరవలేనివని కలెక్టర్ కె.హరిత అన్నారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్‌గా పదోన్నతిపై వెళ్తున్న దీపక్ తివారి ఆత్మీయ వీడ్కోలును మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ దీపక్ తివారి జిల్లాలో 2 సంవత్సరాల 8 నెలల పాటు విధులు ని ర్వహించి జిల్లా అభివృద్ధికి పాటుపడ్డారని కొనియాడారు. జిల్లా ఇన్‌చార్జి విద్యాధికారిగా విద్యారంగం బలోపేతానికి, ఆకాంక్షిత జిల్లా తిర్యాణి బ్లాక్‌లో నిర్దేశించిన లక్ష్యాల సాధనకు కృషి చేశారన్నారు. అనంతరం దీపక్ తివారి మాట్లాడుతూ విధి నిర్వహణలో జిల్లాలోని అధికారులు అన్నివిధాలా సహకరించారని తెలిపారు. అందరి సహకారంతో శాసనసభ, పార్లమెంట్, సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో లోకేశ్వర్‌రావు, జిల్లాలోని అధికారులు పాల్గొన్నారు.


