కాగజ్‌నగర్‌టౌన్: అంగన్‌వాడీ టీచర్లు, ఆయా ల సమస్యలు పరిష్కరించాలని చేపట్టిన ‘చలో హైదరాబాద్’ కార్యక్రమానికి వెళ్లకుండా జిల్లాలోని అంగన్‌వాడీ వర్కర్లను పోలీసులు అరెస్టు చేయడం సరికాదని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ముంజం శ్రీనివాస్ అన్నారు. పట్టణంలోని రాజీవ్ గాంధీ చౌరస్తాలో సోమవారం నిరసన వ్యక్తం చేశారు. ఆయన మా ట్లాడుతూ హైదరాబాద్‌కు వెళ్లకుండా సీఐ టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఆర్.త్రివేణిని రాత్రి ఇంటి నుంచి అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌లో నిర్బంధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అక్రమంగా అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు ఆనంద్, అరుణ, వినోద, మల్లేశ్వరి, విజయ్, రాణి, కళావతి, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.


