అలరించిన ‘యూత్‌ పార్లమెంట్‌’ పోటీలు | - | Sakshi
Sakshi News home page

అలరించిన ‘యూత్‌ పార్లమెంట్‌’ పోటీలు

Mar 6 2026 8:13 AM | Updated on Mar 6 2026 8:13 AM

కాగజ్‌నగర్‌టౌన్‌: పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళా శాలలో గురువారం నిర్వహించిన వికసిత్‌ భారత్‌ యూత్‌ పార్లమెంట్‌ పోటీలు ఆకట్టుకున్నాయి. ముందుగా కళాశాల ప్రిన్సిపాల్‌ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముఖ్య అతిథిగా హాజరైన హైకోర్టు న్యాయవాది గట్టు కుమార్‌ కార్తీక్‌ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం దేశంలోని యువతను సామూహికం చేసేందుకు వికసిత్‌ భారత్‌ కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు. ఇలాంటి ఉపన్యాస పోటీలతో విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయన్నారు. యువత ఆలోచన దృక్పథం మారాలని, సామాజికంగా ఆర్థికంగా ఎదగాలని, టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని సూచించారు. పర్యావరణాన్ని కాపాడుతూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అనంతరం ప్రిన్సిపాల్‌ శ్రీదేవి మాట్లాడుతూ పోటీలో గెలుపొందిన ఐదుగురు విద్యార్థులు రాష్ట్రస్థాయిలో జరిగే పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. అక్కడ ప్రతిభ చూపిన ముగ్గురు పార్లమెంట్‌ జరిగే కార్యక్రమంలో పాల్గొంటారని పేర్కొన్నారు. అనంతరం జిల్లాలోని వివిధ కళాశాల నుంచి హాజరైన విద్యార్థులు ‘అత్యవసర పరిస్థితికి 50 ఏళ్లు భారత ప్రజాస్వామ్యానికి పాఠాలు’ అనే అంశంపై ఉపన్యాసించారు. అసోసియెట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ డి.లక్ష్మీనరసింహం, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ రామకృష్ణ, రిటైర్డ్‌ ఎంఈవో శంకరయ్య, కాగజ్‌నగర్‌ ప్రెస్‌క్లబ్‌ అధ్యక్షుడు తాళ్లపల్లి సురేందర్‌, అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ చిలు వేరు శ్రీనివాస్‌ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం ఆఫీసర్‌ దత్తాత్రేయ, అకడమిక్‌ కోఆర్డినేటర్‌ జనార్దన్‌, అధ్యాపకులు రాజేశ్వర్‌, శారద, దేవేందర్‌, వెంకటేశం, క్రిష్ణవేణి, మేరి, శాంభవి, సోనియా పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement