కాగజ్‌నగర్‌టౌన్: పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని ఎ మ్మెల్సీ దండె విఠల్ పేర్కొన్నారు. శనివారం పట్ట ణంలోని గాంధీ పార్క్‌లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కా ర్యక్రమంలో భాగంగా మున్సిపల్ కమిషనర్ తిరుప తి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్ర జా సమస్యలు తెలుసుకునేందుకు ప్రజాపాలన కా ర్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా అధికారులు ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తారని పేర్కొన్నారు. పట్టణ ప్రజలు చెత్త ను ఇంటింటా తిరిగే మున్సిపల్ చెత్తవాహనాల్లో వే యాలని సూచించారు. 99 రోజుల ప్రగతి ప్రణాళికలో పట్టణంలో సమస్యలు పరిష్కారమవుతాయని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ తిరుపతి, ప్రత్యేకాధికారి సాయి, మున్సిపల్ డీఈ, మున్సిపల్ చైర్‌పర్సన్ సాహిన్ సుల్తానా, వైస్ చైర్‌పర్సన్ డాక్టర్ కొత్తపల్లి అనిత, కౌన్సిలర్లు జ్యోతి, వసీమున్నీసా, విజయ్‌కుమార్, విశ్వేశ్వర్‌రావు, నా యకులు దస్తగీర్, షబ్బీర్, శివ, మెప్మా సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది, మహిళలు పాల్గొన్నారు.


